ముంబై టెస్ట్: తడిగా ఉన్న మైదానం.. టాస్ ఆలస్యం

03-12-2021 Fri 09:33
  • ఫలితం తేలకుండానే ముగిసిన కాన్పూరు టెస్టు
  • ఈ మ్యాచ్‌‌పైనే ఇరు జట్లు దృష్టి
  • టీమిండియాను నడిపించనున్న కోహ్లీ
  • మ్యాచ్‌కు దూరమైన విలియమ్సన్?
Toss delayed due to wet outfield
భారత్-న్యూజిలాండ్ మధ్య నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా మైదానం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాన్పూరులో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి చివరికి డ్రాగా ముగిసింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు, ఈ టెస్టులో గెలిచిన జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి పేరుతో మూడు టీ20లు, తొలి టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మళ్లీ పగ్గాలు చేపడుతున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ విలియమ్సన్ దూరమైనట్టు తెలుస్తోంది.