Depression: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

  • విశాఖకు 960 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • వాయవ్య దిశగా పయనం
  • రాగల 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం
  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా
Low pressure turns depression in Bay of Bengal

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ సాయంత్రం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ వాయుగుండం వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో తుపానుగా మారుతుందని వివరించింది.

కాగా, ఇది తుపానుగా మారితే 'జవాద్' అని పిలవనున్నారు. ఈ తుపాను డిసెంబరు 4వ తేదీ వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉత్తర కోస్తా, ఒడిశా తీర ప్రాంతాలకు ఐఎండీ ఇప్పటికే వర్ష సూచన జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, దక్షిణ ఒడిశాలో రేపటి నుంచి తుపాను ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది.

More Telugu News