Uppal Lands: ఉప్పల్ భూముల వేలానికి భారీ స్పందన... చదరపు గజం రూ.1 లక్ష పైనే!

HMDA auctioned Uppal lands
  • కొంతకాలంగా తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం
  • తాజాగా ఉప్పల్ భూముల వేలం
  • తొలిరోజు 23 ప్లాట్ల వేలం
  • హెచ్ఎండీఏకి రూ.141.61 కోట్ల ఆదాయం
తెలంగాణలో మరోసారి ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నారు. గతంలో కోకాపేట వంటి ప్రాంతాల్లో వేలం వేసి భారీగా ఆదాయాన్ని ఆర్జించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తాజాగా ఉప్పల్ లోని ప్రభుత్వ భూములను వేలానికి తీసుకువచ్చింది.

తొలి రోజు వేలం ముగియగా, 23 ప్లాట్లకు వేలం నిర్వహించారు. వీటిలో రెండు ప్లాట్లకు అదిరిపోయే ధర లభించింది. చదరపు గజం నిర్ధారిత ధర రూ.35 వేలు కాగా, తాజా వేలంలో రూ.1.01 లక్షల ధర పలకడం విశేషం. హెచ్ఎండీఏకి ఇవాళ మొత్తం రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది.

ఈసారి వేలంలో లోకల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు. ఇవాళ 23 ప్లాట్లు వేలంలో ఉంచారు. రేపు మరో 23 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు.
Uppal Lands
Auction
HMDA
Telangana

More Telugu News