Nara Lokesh: అఖండ... ఊర మాస్ హిట్: నారా లోకేశ్

Nara Lokesh terms Balakrishna Akhanda a massive hit
  • బాలకృష్ణ 'అఖండ' నేడు విడుదల
  • బాక్సాఫీసు వద్ద ప్రభంజనం
  • చిత్ర బృందానికి లోకేశ్ అభినందనలు
  • జై బాలయ్యా అంటూ ట్వీట్
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ సందడి చేస్తోంది. నేడు (డిసెంబరు 2) రిలీజైన ఈ చిత్రం ప్రతి సెంటర్ లోనూ విశేష ప్రజాదరణ పొందుతోంది. తాజాగా 'అఖండ' మేనియాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బాలా మావయ్య, దర్శకుడు బోయపాటి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటీనటులు, ఇతర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. 'అఖండ'మైన ఊర మాస్ హిట్ కొట్టారంటూ కొనియాడారు. "ఎక్కడ విన్నా ఒకటే మాట.... జై బాలయ్యా" అంటున్నారని వెల్లడించారు.

బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. శ్రీకాంత్ ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో అఖండ పాత్రకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయని మీడియా రివ్యూలు, రిపోర్టులు చెబుతున్నాయి.
Nara Lokesh
Akhanda
Balakrishna
Boyapati Sreenu
Mass Hit
Tollywood

More Telugu News