Sotrovimab: ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని గుర్తించిన బ్రిటన్

Britain certifies Sotrovimab for antibody treatment
  • ప్రపంచదేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్
  • సోట్రోవిమాబ్ ఔషధానికి బ్రిటన్ ఆమోదం
  • బ్రిటన్ లో ఆశాదీపంలో కనిపిస్తున్న సోట్రోవిమాబ్
  • 79 శాతం ముప్పును తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడి
కరోనా సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ ధాటికి బెంబేలెత్తిపోయిన దేశాలను తాజాగా ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి వెల్లడైంది. భారత్ లోనూ ఒమిక్రాన్ ప్రవేశించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఎంత ప్రమాదకారి అన్నది ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వ్యాఖ్యానించింది.

అయితే, ఒమిక్రాన్ పై భయపడాల్సిన పనేమీలేదని, ఈ కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని తాము గుర్తించినట్టు బ్రిటన్ వెల్లడించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్. ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. కరోనా సోకిన వారికి సోట్రోవిమాబ్ ఇంజెక్షన్  తో యాంటీబాడీ చికిత్స చేయగా, వారిలో మరణించే ప్రమాదం 79 శాతం తగ్గినట్టు వెల్లడైంది.

ఈ మందును నరాల ద్వారా ఎక్కించగా, కరోనా వైరస్ మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన తొలినాళ్లలో సోట్రోవిమాబ్ సింగిల్ డోస్ ఇస్తే, మంచి పనితీరు కనబరుస్తుందని వివరించారు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా దీన్ని వాడాలని బ్రిటన్ కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది.

సోట్రోవిమాబ్ తో పాటు రోనా ప్రీవ్ ఔషధం కూడా గణనీయంగా ప్రభావం చూపుతోందని ఎంహెచ్ఆర్ఏ తెలిపింది. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను ఈ ఔషధాలు దీటుగా ఎదుర్కొంటాయని పేర్కొంది.
Sotrovimab
Britain
Omicron
New Variant
MHRA
GSK

More Telugu News