Nani: బుల్లితెర నుంచి హిట్ అందుకున్న 'టక్ జగదీష్'

Good Reting For Tuck Jagadish in Star Maa
  • అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చిన 'టక్ జగదీష్'
  • ఆశించిన స్థాయిలో లభించని రెస్పాన్స్ 
  • టీవీలో రికార్డు స్థాయి రేటింగ్ 
  • ఖుషీ అవుతున్న నాని టీమ్  
నాని హీరోగా శివ నిర్వాణ 'టక్ జగదీష్' సినిమాను రూపొందించాడు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన థియేటర్స్ కి కాకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఈ సినిమా ఫరవాలేదనిపించుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా స్టార్ మాలో ప్రసారమైంది.

ఈ సినిమాకి 10.90 టీఆర్పీ రావడం విశేషం. బలమైన కథాకథనాలతో రూపొందించిన ఈ సినిమాను థియేటర్స్ లో దింపలేకపోయినందుకు నానీకి ఒక రకమైన అసంతృప్తి ఉండేది. ఇక ఓటీటీ ద్వారా వచ్చిన రెస్పాన్స్ కూడా ఆయనకి అంతగా సంతోషాన్ని ఇవ్వలేదు.

కానీ టీవీలో ఈ సినిమా ఈ స్థాయి రేటింగ్ ను నమోదు చేయడం, ఈ సినిమా టీమ్ కి ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. ఒక రకంగా ఈ సినిమాకి బుల్లితెర నుంచి హిట్ లభించిందని వాళ్లంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు తమ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయిందని భావించి హమ్మయ్య అనుకుంటున్నారు.
Nani
Ritu Varma
Jagapathi Babu
Tuck Jahadish Movie

More Telugu News