ఆసక్తిని పెంచుతున్న 'లక్ష్య' ట్రైలర్!

01-12-2021 Wed 17:33
  • నాగశౌర్య కథానాయకుడిగా 'లక్ష్య'
  • విలువిద్య నేపథ్యంలో సాగే కథ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ఈ నెల 10వ తేదీన విడుదల
Lakshya trailer released
నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'లక్ష్య' సినిమా రూపొందింది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. విలువిద్య నేపథ్యంలో .. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. "వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావ్ .. ఇద్దరూ ఒకటేగా" .. "పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం"

"నేను వందమందికి నచ్చక్కరలేదు సార్ .. కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇక నేను గెలిచేది దేనికి సార్" వంటి డైలాగ్స్ బాగున్నాయి. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.