Jr NTR: ఏపీలో వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR donates towards flood affected people in AP

  • ఏపీలో వరద బీభత్సం
  • ముఖ్యంగా కడప జిల్లాలో జలవిలయం
  • 40 మందికి పైగా మృతి
  • కలచివేసిందన్న ఎన్టీఆర్

ఏపీలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించగా, ఒక్క కడప జిల్లాలోనే 40 మందికి పైగా జలవిలయానికి బలయ్యారు. తీవ్రస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కోల్పోయి దీనస్థితిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఏపీలో వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.

రాష్ట్రంలో వరద బాధితుల కడగండ్లు చూశాక కలచివేసిందని తెలిపారు. అందుకే వారికి సాయంగా తన వంతుగా కొద్దిమొత్తం విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News