TSRTC: ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. టికెట్ ధరలు పెంచండి: తెలంగాణ ప్రభుత్వానికి సజ్జనార్ ప్రతిపాదనలు

  • ఆర్డినరీ బస్సులో కి.మీ.కు 20 పైసలు పెంచాలి
  • ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదనలు
  • వారం రోజుల్లో టికెట్ ధరలు పెంచే అవకాశం
TSRTC Ticket rates to increase

తెలంగాణలో ఆర్టీసీ టికెట్ల ధరలు పెరగనున్నాయి. టికెట్ ధరలను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనలు పంపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్ కు 20 పైసలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్ కు 30 పైసలు పెంచాలని ఆయన ప్రతిపాదించారు. సజ్జనార్ ప్రతిపాదనల మేరకు కొత్త రేట్లు మరో వారం రోజుల్లోగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ... టికెట్ ఆదాయం పైనే ఆర్టీసీ ఆధారపడి ఉందని తెలిపారు. టికెట్ ధరలను పెంచి రెండేళ్లయిందని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారంగా పరిణమించాయని తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై అదనంగా రూ. 468 కోట్ల భారం పడుతోందని సజ్జనార్ తెలిపారు. ఈ ఏడాది రూ. 1,400 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని చెప్పారు.

More Telugu News