Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం.. ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు!
- కాసేపట్లో సీఎస్ కు ఉద్యమ నోటీసు ఇవ్వబోతున్న ఉద్యోగ సంఘాలు
- ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
- వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయనున్న ఉద్యోగులు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచణ నోటీసు ఇవ్వనున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలైన బొప్పరాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్ ను అందజేయనున్నారు.
ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు అమలు చేయనున్నాయి. తన న్యాయపరమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉద్యోగుల డిమాండ్లలో 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపు తదితర అంశాలు ఉన్నాయి.