హీరోయిన్ మాళ‌విక పోస్ట్ చేసిన ఫొటోల‌ను చూసి షాక్ అవుతోన్న ఫ్యాన్స్‌

30-11-2021 Tue 11:53
  • ఆమె చేతికి గాయం
  • కాలికి కూడా గాయాలు!
  • తాజాగా గాయమైన ఫొటో పోస్ట్ చేసిన వైనం
Malavika mohanan injured in tamilnadu
హీరోయిన్ మాళ‌విక పోస్ట్ చేసిన ఫొటోల‌ను చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె చేతికి గాయంతో క‌న‌ప‌డుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆమె కాలికి కూడా గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. త‌ల‌పై చేయి పెట్టుకుని గాయాల‌ను చూపిస్తూ ఆమె ఈ ఫొటోలు దిగింది.  
       
                                           
సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’ లో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌లో న‌టిస్తోన్న స‌మ‌యంలో మాళ‌విక గాయ‌ప‌డింది. ఆమె చేతితో పాటు కాలికి దెబ్బ‌లు త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ సినిమా షూటింగ్‌లో గాయాలపాలు అవుతుండ‌డం సాధార‌ణ‌మేన‌ని ఆమె చెప్పింది. కాగా, సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక.  

సోషల్‌ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సాధార‌ణంగా అందాలు ఆర‌బోస్తూ ఆమె ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే, ఒక్క‌సారిగా గాయాలు చూపెడుతూ ఆమె పోస్టులు చేయ‌డంతో ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాళవిక రజనీకాంత్ న‌టించిన‌ పెటా సినిమాలోనూ కీలక పాత్రలో నటించింది. ప్ర‌స్తుతం హీరో ధనుశ్ సినిమా ‘మారన్‌’లోనూ నటిస్తోంది. ఆమె ప‌లు త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.