'భీమ్లా నాయక్' నుంచి వచ్చేస్తున్న ఫోర్త్ సింగిల్!

30-11-2021 Tue 11:22
  • సాగర్ కె చంద్ర నుంచి 'భీమ్లా నాయక్'
  • ప్రధాన పాత్రలో పవన్ - రానా 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని 
  • జనవరి 12వ తేదీన సినిమా రిలీజ్   
Bheemla Nayak movie update
పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి మూడు సింగిల్స్ ను వదిలారు. ఈ మూడు సింగిల్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గొవ సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

డిసెంబర్ 1వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'అడవితల్లి మాట' అంటూ ఈ పాట సాగనుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన పాట ఇది. మరి ఈ పాట ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.

పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ పరిచయం కానుంది. కీలకమైన పాత్రలో సముద్రఖని నటించగా, ముఖ్యమైన పాత్రలో మురళీశర్మ పరిచయం కానున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.