'బింబిసార' నుంచి టీజర్ రిలీజ్

29-11-2021 Mon 11:10
  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్
  • సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్
  • దర్శకుడిగా చిరంతన్ భట్
  • వచ్చేనెలలో విడుదలయ్యే ఛాన్స్  
Bimbisara Teaser Released
కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. ఎలాంటి హడావిడి లేకుండా కల్యాణ్ రామ్ ఈ సినిమా షూటింగును పూర్తిచేశాడు. వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, డిసెంబర్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.  

"ఒక సమూహం తాలూకు ధైర్యాన్ని ఒక ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే .. " అంటూ ఈ టీజర్ మొదలవుతోంది. టైటిల్ కి తగినట్టుగానే రాజులు .. రాజ్యాలు .. యుద్ధాలు ఈ టీజర్ లో కనిపిస్తున్నాయి. అయితే ఇది రెండు కాలాల మధ్య జరిగే కథ అనే టాక్ కొన్ని రోజుల క్రితమే బయటికి వచ్చింది.

అందుకు తగినట్టుగానే బింబిసారుడిగాను .. ఈ కాలానికి చెందిన యువకుడిగాను రెండు విభిన్నమైన లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు.