అరుదైన‌ సంఘ‌ట‌న‌ .. అమ‌రావ‌తి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ రెడ్డి సంఘీభావం

29-11-2021 Mon 11:01
  • నెల్లూరులో బ‌స చేసిన రైతులు
  • వారి వ‌ద్ద‌కు శ్రీ‌ధ‌ర్ రెడ్డి
  • ఏ అవ‌స‌రం వ‌చ్చినా త‌న‌ను సంప్ర‌దించాల‌ని వ్యాఖ్య‌
  • జై అమ‌రావ‌తి అంటూ నిన‌దించాల‌న్న‌ రైతులు
  • నిరాక‌రించిన‌ శ్రీ‌ధ‌ర్ రెడ్డి  
sridha reddy supports amaravati farmers padayatra
అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర కొన‌సాగుతోంది. అమ‌రావ‌తినే ఏపీ రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని వారు డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. రైతులు నెల్లూరు మీదుగా వెళ్తూ ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. ఈ స‌మ‌యంలో అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. రైతుల‌కు వైసీపీ నేత‌, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల‌తో కాసేపు మాట్లాడారు.

రైతులకు ఏ అవ‌స‌రం వ‌చ్చినా త‌న‌ను సంప్ర‌దించాల‌ని, తాను స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు. అయితే, ఆ స‌మ‌యంలో జై అమ‌రావ‌తి అంటూ నిన‌దించాల‌ని రైతులు కోరారు. అందుకు శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిరాక‌రించారు. ఆ నినాదం చేసేందుకు త‌న‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.