అనిల్ రావిపూడితో బాలయ్య సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

29-11-2021 Mon 10:28
  • బాలకృష్ణ నుంచి భారీ చిత్రంగా 'అఖండ'
  • డిసెంబర్ 2వ తేదీన విడుదల 
  • రెగ్యులర్ షూటింగుకు గోపీచంద్ మలినేని ప్రాజెక్టు 
  • వచ్చే ఏడాదిలో అనిల్ రావిపూడితో సినిమా
Balakrishna in Anil Ravipudi movie
బాలకృష్ణ ఎప్పటిలానే ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఎక్కడా గ్యాప్ రాకుండా విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల జాబితా ఇదే విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. ఆయన తాజా చిత్రమైన 'అఖండ' డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఆ తరువాత సినిమాను ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ నటించనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. ఆల్రెడీ ఆయన అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జులై నుంచి మొదలుపెడతారట. ఈ లోగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' షూటింగును పూర్తిచేసేసి, బాలకృష్ణ స్క్రిప్ట్ ను సెట్ చేస్తాడు. బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని సినిమా పూర్తి చేస్తారన్నమాట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ తరహా మాస్ మార్కు .. తన మార్కు కామెడీ ఉంటుందని ఇంతకుముందే అనిల్ రావిపూడి చెప్పిన విషయం తెలిసిందే.