తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

29-11-2021 Mon 07:09
  • కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు
  • ఈ తెల్లవారుజామున గుండెపోటు
  • ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూత
Dollar Seshadri passed away with heart attack
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్టణం వెళ్లిన ఆయన వేకువజామున గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు.

1978 నుంచి శ్రీవారి సేవలోనే ఉన్న శేషాద్రి 2007లోనే రిటైరయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయనను తిరిగి ఓస్డీగా నియమించింది. ఆయన మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.