పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

28-11-2021 Sun 17:12
  • రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
  • టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం
  • తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడొద్దని స్పష్టీకరణ
  • ధాన్యంపై కేంద్రాన్ని నిలదీయాలని వెల్లడి
KCR directs TRS MPs ahead of parliament winter sessions
రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ ప్రగతి భవన్ లో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ బాణీని గట్టిగా వినిపించాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఓపికపట్టామని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్దేశించారు. బాయిల్డ్ రైస్ పై కేంద్రం వైఖరిపై నిలదీయాలని స్పష్టం చేశారు.