Kadapa District: కడప జిల్లాలో మరోసారి వర్ష బీభత్సం... ఇల్లు ఎలా కూలిపోయిందో చూడండి!

Heavy rains lashes Kadapa district as a house collapse into river

  • కడప జిల్లాలో భారీ వర్షాలు
  • ఇప్పటికే నిండిపోయిన చెరువులు
  • రైల్వే కోడూరు-తిరుపతి మార్గంలో నిలిచిన రాకపోకలు
  • రైల్వే కోడూరులో ఉప్పొంగుతున్న గుంజనేరు

కడప జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకపోగా, మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే నిండిన చెరువులు, జలాశయాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే జిల్లాలోని ఊటుకూరు చెరువుకు మరమ్మతులు చేశారు. ఇప్పుడా చెరువుకు ఏ క్షణాన అయినా గండి పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఇక, కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని ముందే గమనించిన ఆ ఇంట్లోని వారు బయటికి వచ్చేశారు. ఈ మధ్యాహ్నం ఆ ఇల్లు కాలువలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

  • Loading...

More Telugu News