Shreyas Iyer: తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ... శ్రేయాస్ అయ్యర్ రికార్డు

  • కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులు చేసిన అయ్యర్
  • రెండో ఇన్నింగ్స్ లో 65 రన్స్
  • టీమిండియాను ఆదుకున్న అయ్యర్, అశ్విన్, సాహా
Shreyas Iyer set record in his debut test

కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెటర్లలో ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న టెస్టులో అయ్యర్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడి 105 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న స్థితిలో జట్టును ఆదుకుని 65 పరుగులు సాధించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే... అయ్యర్, అశ్విన్ (32), వృద్ధిమాన్ సాహా (22 బ్యాటింగ్) ఆదుకోవడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలే ప్రమాదం నుంచి గట్టెక్కింది. అయ్యర్ 65 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో అవుటయ్యాడు. టీ విరామ సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 216 పరుగులకు చేరింది.

More Telugu News