హుసేన్ సాగ‌ర్‌లోకి దూసుకెళ్లిన కారు.. వీడియో ఇదిగో

28-11-2021 Sun 11:36
  • ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు
  • ఒక‌రి చేయి విరిగిన వైనం
  • హుసేన్ సాగ‌ర్‌లోంచి కారును బయటకు తీసిన పోలీసులు
car rammed into sagar
హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒక యువ‌కుడి చేయి విరిగింది. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందేలా చేస్తున్నారు.

హుసేన్ సాగ‌ర్‌లోంచి కారును బయటకు తీశారు. ఆ కారు ముందు భాగం ధ్వంస‌మైంది. బాధితుల పేర్లు నితిన్, సాత్విక్, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. వారంతా ఖైరతాబాద్‌కు చెందిన యువ‌కుల‌ని చెప్పారు. ఆ కారును ఇటీవ‌ల కొన్నార‌ని, అందులో యువ‌కులు ప్ర‌యాణిస్తుండ‌గా ఒక్క‌సారిగా నియంత్ర‌ణ కోల్పోయార‌ని పోలీసులు చెప్పారు.