దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ కుటుంబంలో విషాదం!

27-11-2021 Sat 18:03
  • ఎంజీఆర్ సోదరుడి కుమార్తె లీలావతి మృతి
  • ఎంజీఆర్ కు కిడ్నీ దానమిచ్చిన లీలావతి
  • ఆమె వయసు 71 సంవత్సరాలు
MGRs brothers dauthter Leelavathi passes away
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆనాటి తమిళ సినీ నటుడు చక్రపాణి కుమార్తె లీలావతి మృతి చెందారు. చెన్నైలోని పెరుంగుడిలో ఆమె నివసిస్తున్నారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. ఇటీవలే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

ఎంజీఆర్ అమెరికాలోని బ్రూక్లిన్ ఆసుపత్రిలో మూత్రాశయ సమస్యలతో చికిత్స పొందుతున్నప్పుడు ఆయనకు లీలావతి ఒక కిడ్నీని దానం ఇచ్చారు. ఆమె ఇచ్చిన కిడ్నీ వల్లే ఎంజీఆర్ ప్రాణగండం నుంచి బయటపడ్డారు. మరికొన్నేళ్లు బతికి, సీఎంగా కొనసాగారు. లీలావతి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రులు, అన్నాడీఎంకే నేతలైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతాపాన్ని ప్రకటించారు.