Kalyan Ram: 'బింబిసార' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!

Bimbisara movie released date confirmed
  • బింబిసారుడుగా కల్యాణ్ రామ్
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
  • ఈ నెల 29న టీజర్ రిలీజ్
  • వచ్చేనెలలో సినిమా విడుదల
కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.  ఈ నెల 29వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

వచ్చేనెలలో సినిమాను విడుదల చేయనున్నారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. కల్యాణ్ రామ్ సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ కనువిందు చేయనున్నారు. కొంత గ్యాప్ తరువాత కేథరిన్ చేసిన సినిమా ఇది. తెలుగులో సంయుక్త మీనన్ కి ఇది ఫస్టు మూవీ.

రాజులు .. రాజ్యాలు .. యుద్ధాలు అన్నట్టుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు బయటికి వచ్చాయి. టైమ్ ట్రావెల్ చేస్తూ బింబిసారుడు కాలానికి వచ్చిన కథానాయకుడు అక్కడ ఈ దృశ్యాలను చూస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Kalyan Ram
Samyuktha Menon
Catherine
Bimbisara Movie

More Telugu News