ఆఫ్రికా దేశాల్లో కొత్త వేరియంట్ కలకలం... ఐసీసీ టోర్నీ రద్దు

27-11-2021 Sat 17:19
  • జింబాబ్వేలో మహిళల ప్రపంచకప్ అర్హత టోర్నీ
  • నేడు శ్రీలంక, వెస్టిండీస్ మ్యాచ్
  • మ్యాచ్ తో పాటు టోర్నీని కూడా రద్దు చేసిన ఐసీసీ
  • ఆఫ్రికా దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు
  • ఇతర దేశాల్లోనూ అదే పరిస్థితి
ICC cancelled womens world cup qualifier tourney amidst corona new variant scares
ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఇప్పుడు క్రీడారంగంపైనా పడింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ కూడా కొత్త వేరియంట్ ప్రభావంతో నిలిచిపోయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

ఆతిథ్యదేశం జింబాబ్వేలోనూ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో టోర్నీని కొనసాగించలేమని ఐసీసీ ఈవెంట్స్ విభాగం అధిపతి క్రిస్ టెట్లీ వెల్లడించారు. ఆయా దేశాలు చాలా తక్కువ వ్యవధిలో విమాన సర్వీసులు రద్దు చేశాయని, దాంతో వివిధ జట్లు వారి సొంత దేశాలకు వెళ్లడం కష్టసాధ్యంగా మారనుందని పేర్కొన్నారు.