Vishnu Vardhan Reddy: కాగ్‌ నివేదికపై వైఎస్ జ‌గ‌న్ వివరణ ఇవ్వాలి: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

vishnu vardhan reddy slams jagan
  • ఏపీలో పెట్టుబడి వ్యయంపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
  • ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక ఖర్చు నిష్ఫలం
  • సంవత్సరంలో రెవెన్యూ వ్యయమే 88.65%
  • ఆస్తుల కల్పనకు 11.35% మాత్రమే వినియెగించడం ఏంటి?
ఏపీలో పెట్టుబడి వ్యయంపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. ' మౌలిక సౌకర్యాల కల్పన‌ లేదు.. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆశ్చర్యం. ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక ఖర్చు నిష్ఫలం అని చెప్పిన  కాగ్‌ నివేదికపై  వైఎస్ జ‌గ‌న్ గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వండి' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి నిల‌దీశారు.  

'సంవత్సరంలో రెవెన్యూ వ్యయమే 88.65% ఉండటంతో ఆస్తుల కల్పనకు 11.35% మాత్రమే వినియోగించ‌డం ఏంటి? స్థిర మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు' అని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శించారు.

'2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆస్తిని సృష్టించారో వైకాపా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.  దేశంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన అప్పులు చెల్లించకుండా, అప్పులు కట్టడం కోసం కొత్త అప్పులు తీసుకుని, వాటిని కూడా గతంలో చేసిన‌ అప్పులు తీర్చ‌డానికి ఖ‌ర్చు చేయ‌కుండా వడ్డీని మాత్రమే చెల్లించి మిగిలిన ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఆర్థిక క్రమ‌శిక్షణలేని ఏకైక ప్రభుత్వం ఒక్క వైకాపా మాత్రమే' అని విష్ణు వ‌ర్ధన్ రెడ్డి అన్నారు.
Vishnu Vardhan Reddy
BJP
Jagan

More Telugu News