Arvind Kejriwal: ఆ దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేయండి: మోదీకి కేజ్రీవాల్ విన్నపం

Stop Flights From Countries Affected By New Variant says Arvind Kejriwal
  • పలు దేశాల్లో నమోదవుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
  • ఆఫ్రికా దేశాల నుంచి స్ట్రెయిన్ మన దేశంలో ప్రవేశించే అవకాశం ఉందన్న కేజ్రీ
  • ఎక్స్ పర్ట్ లతో సమావేశం కానున్న కేజ్రీవాల్
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లతో సమావేశం కాబోతున్నానని చెప్పారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని నిపుణులను కోరానని తెలిపారు.
Arvind Kejriwal
AAP
Narendra Modi
BJP
Corona Virus
Omicron

More Telugu News