ఉదాసీనత వద్దు.. ప్రజలు తక్షణం అప్రమత్తం కావాలి: కరోనా కొత్త వేరియంట్‌పై విజయసాయిరెడ్డి
- దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో కొత్త వేరియంట్
- డబ్ల్యూహెచ్‌వో ఈ విషయాన్ని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది
- యూరప్ లోని పలు ఎయిర్ లైన్స్ ఆ దేశాలకు సర్వీసులు నిలిపేశాయి
- అందరూ టీకాలు తీసుకోవాలి
'దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో B.1.1529 అనే కరోనా రకాన్ని గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్ లోని పలు ఎయిర్ లైన్స్ ఆ దేశాలకు సర్వీసులు నిలిపేశాయి. టీకాలు తీసుకోకుండా ఉదాసీనత కనబరుస్తున్నవారు తక్షణం అప్రమత్తం కావాలి. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి' అని విజయసాయిరెడ్డి సూచించారు.