రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న 150 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

26-11-2021 Fri 12:44
  • కర్ణాటక ధార్వాడ్ లోని మెడికల్ కాలేజీలో కలకలం
  • తరగతుల రద్దు.. హాస్టళ్ల మూసివేత
  • ఇటీవలే కాలేజీలో జరగిన ఓ ఈవెంట్
Medical College 150 students who vaccinated tests corona positive
జనాలు ఉలిక్కిపడే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 150 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. కర్ణాటక ధార్వాడ్ లోని ఎస్డీఎం మెడికల్ హాస్పిటల్ లో చదువుతున్న 150 మంది స్టూడెంట్స్ కి కరోనా నిర్ధారణ అయింది. వీరందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లే. విద్యార్థులు కరోనా బారిన పడటంతో కాలేజీకి చెందిన రెండు హాస్టళ్లను మూసేశారు. మెడికల్ కాలేజీలో తరగతులను రద్దు చేశారు.

కరోనా బారిన పడిన విద్యార్థులను హాస్టల్ లోనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. ఇటీవలే ఈ కాలేజీలో ఓ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమం వల్లే విద్యార్థులు కరోనా బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బెంగళూరు సిటీలోని ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్లో 33 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది.