Andhra Pradesh: వైఎస్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనని డౌటు: ఎంపీ మోపిదేవి

Mopidevi Venkataramana Accuses Chandrababu Role in YSR Mystery Death
  • ‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’ మాటలకు అర్థమేంటి?
  • జగన్ పై ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
  • వైఎస్ మృతి అనుమానితుల్లో ఒకరన్న ఎంపీ
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన మరణంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు.

‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే.. వైయ‌స్సార్‌ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా.. అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఏ ఉద్దేశంతో సీఎం వైయ‌స్‌ జగన్‌పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో బాబు చెప్పాలన్నారు.

ఇవాళ గుంటూరు జిల్లా పొన్నపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే.. వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అన్న ఆ మాటలకు అర్థం ఏంటని, ఏ ఉద్దేశంతో జగన్ పై చంద్రబాబు ఆ కామెంట్లు చేశారని ప్రశ్నించారు.
Andhra Pradesh
Telangana
YSR
YSRCP
Mopidevi Venkataramana
Chandrababu

More Telugu News