Yandamuri Veerendranath: యండమూరి కథతో రామ్ గోపాల్ వర్మ చిత్రం

Ram Gopal Varma to make movie Thulasi Theertham with Yandamuri story
  • యండమూరి 'తులసి దళం'కు సీక్వెల్ గా 'తులసి తీర్థం'
  • యండమూరి కథతో తొలిసారి చిత్రాన్ని నిర్మించనున్న ఆర్జీవీ
  • నిర్మాతగా వ్యవహరించనున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ
యండమూరి వీరేంద్రనాథ్... ప్రముఖ నవలా రచయితగా ఆయనకు ఉన్న గుర్తింపు అమోఘం. ఆరోజుల్లో స్టార్ హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఆయనకు ఉండేది. ఆయన రచించిన ఎన్నో నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. అంతేకాదు స్వయంగా కొన్ని చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. తాజాగా యండమూరి తన 'తులసి దళం' నవలకు సీక్వెల్ కథ 'తులసి తీర్థం' రాశారు.

ఈ కథ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యండమూరి కథతో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ తో అద్భుతంగా నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
Yandamuri Veerendranath
Thulasi Theertham
Ram Gopal Varma
Tollywood

More Telugu News