HUL: సామాన్యుల జేబుకు చిల్లు.. సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంచేసిన హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ

  • ఉత్పాదక ఖర్చులు పెరిగిపోవడంతోనే నిర్ణయం
  • మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపడం లేదన్న కంపెనీలు
  • కనిష్టంగా రూ. 2 పెంపు
HUL and ITC hike soap and detergent prices

అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరల ప్రభావం నిత్యావసరాల ధరలపై పడింది. ఇప్పటికే ఆకాశాన్నంటిన కూరగాయలు, నూనెల ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిన ఇప్పుడు మరో బాంబు పడింది. సబ్బులు, డిటర్జెంట్లు సహా ఎంపిక చేసిన ఇతర వస్తువుల ధరలను పెంచినట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ  కంపెనీ హిందూస్థాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ తెలిపాయి. ఉత్పాదక ఖర్చులు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అయితే, మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపడం లేదని పేర్కొన్నాయి.

హెచ్‌యూఎల్ తాజా నిర్ణయంతో కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధర 3.4 శాతం (రూ. 2) పెరిగింది. అలాగే, అరకేజీ వీల్ పౌడర్ ప్యాక్‌పై రూ. 2 పెంచి రూ. 30 చేసింది. 250 గ్రాముల రిన్‌బార్‌ ధరను 5.8 శాతం పెంచింది. 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం (రూ. 25) పెంచింది.

100 గ్రాముల ఫియామా డి విల్స్ సబ్బు ధరను ఐటీసీ 10 శాతం పెంచింది. వివెల్ సబ్బు ప్యాక్‌ ధర 9 శాతం పెరిగింది. 150 మిల్లీలీటర్ల ఎంగేజ్ డియోడరెంట్ ధర 7.6 శాతం, 120 మిల్లీలీటర్ల బాటిల్ ధరపై రూ. 7.1 శాతం పెరిగింది.

More Telugu News