యూపీలో దారుణం.. ఎస్సై పరీక్ష రాసి తిరిగి వస్తున్న యువతిపై కారులో అత్యాచారం

26-11-2021 Fri 07:59
  • ఫేస్‌బుక్‌లో యువతితో పరిచయం
  • పరీక్ష కేంద్రం వద్ద కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన యువకుడు
  • మత్తుమందు ఇచ్చి కారులోనే అత్యాచారం
  • స్పృహ తప్పిన యువతిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన వైనం
Man raped facebook friend in moving car in up
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో దారుణం జరిగింది. ఎస్సై పరీక్ష రాసి తిరిగి వస్తున్న యువతిపై ఓ యువకుడు కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు కటకటాల వెనక ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. 21 ఏళ్ల బాధిత యువతికి ఫేస్‌బుక్ ద్వారా హర్యానాలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆగ్రాలో ఎస్సై పరీక్ష రాసేందుకు వెళ్తున్న యువతి అదే విషయాన్ని తేజ్‌వీర్‌కు చెప్పింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న తేజ్‌వీర్ తన డ్రైవర్‌తో కలిసి కారులో ఆగ్రా వెళ్లి ఆమె పరీక్ష రాస్తున్న సెంటర్ బయట కాపుకాశాడు.

పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆపై మత్తుమందు ఇచ్చి కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం స్పృహతప్పిన ఆమెను ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తేజ్‌వీర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.