ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి జకియా ఖానుమ్ నామినేషన్ దాఖలు

25-11-2021 Thu 19:58
  • మండలి చైర్మన్ గా మోషేన్ రాజు
  • రేపు డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక
  • జకియా ఖానుమ్ కు అవకాశం ఇచ్చిన సీఎం జగన్
  • తొలిసారిగా ఓ మైనారిటీ మహిళకు చాన్స్
Zakia Khanum files nomination for AP Legislative Council Dy Chair Person election
ఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు ఇటీవలే బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి జకియా ఖానుమ్ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ తరఫున జకియా ఖానుమ్ కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. జకియా ఖానుమ్ వైసీపీ ఎమ్మెల్సీ అని తెలిసిందే.

కాగా, రేపు డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మండలి చైర్ పర్సన్ పదవికి తొలిసారిగా ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం ద్వారా మైనారిటీలపై సీఎం జగన్ కు ఉన్న ప్రేమ స్పష్టమైందని తెలిపారు.