ఫ్లాప్ ను పట్టించుకోని నిర్మాతలు .. రజనీతో మరో సినిమా!

25-11-2021 Thu 18:25
  • నిరాశ పరిచిన 'అన్నాత్తే'
  • తెలుగులో 'పెద్దన్న' పరిస్థితి అదే 
  • అయినా వెనుకాడని సన్ పిక్చర్స్ 
  • పాండిరాజ్ తో రజనీకాంత్
Rajani in pandyraj movie
రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై 'అన్నాత్తే' సినిమా రూపొందింది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాస్ యాక్షన్ కి ఎమోషన్ ను కలుపుకుంటూ వెళ్లింది. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్న కీర్తి సురేశ్, రజనీకి చెల్లెలుగా నటించడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.

తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన విడుదల చేశారు. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను ఇక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కోలీవుడ్లో కూడా ఈ సినిమాకి అంతగా ఆదరణ లభించలేదు. దాంతో ఈ సినిమా భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో శివతో మరో సినిమా చేస్తానని రజనీ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్ పిక్చర్స్ వారు తమ తదుపరి సినిమాను కూడా రజనీతోనే చేయాలని నిర్ణయించుకోవడం మరింత విస్మయానికి గురిచేసే విషయం. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.