కాన్పూర్ టెస్టులో అయ్యర్-జడేజా సెంచరీ భాగస్వామ్యం... ముగిసిన తొలి రోజు ఆట

25-11-2021 Thu 17:22
  • 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
  • అయ్యర్, జడేజా అర్ధసెంచరీలు
  • 113 రన్స్ జోడించిన అయ్యర్, జడేజా
  • ఆట చివరికి 4 వికెట్లకు 258 రన్స్ చేసిన భారత్
Shreyas Iyer and Ravindra Jadeja steered Team India into safe position in Kanpur Test
కాన్పూర్ టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓ దశలో భారత్ 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా... శ్రేయాస్ అయ్యర్ (75 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (50 బ్యాటింగ్) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 113 పరుగులు జోడించారు. వీరిద్దరి సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో సురక్షిత స్థితిలో నిలిచింది.

మూడో సెషన్ నుంచి అయ్యర్, జడేజా కివీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. అయ్యర్ 7 ఫోర్లు, 2 సిక్సులు బాదగా, జడేజా 6 ఫోర్లు కొట్టాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ కు 3, టిమ్ సౌథీకి 1 వికెట్ లభించాయి.