'వీరమల్లు' కోసం కొత్త లొకేషన్స్!

25-11-2021 Thu 10:41
  • 'భీమ్లా నాయక్'ను పూర్తిచేసిన పవన్
  • త్వరలో 'వీరమల్లు' షూటింగుకు
  • రెడీగానే ఉన్న భారీ సెట్లు
  • కొత్త లొకేషన్స్ వేటలో క్రిష్    
Veeramallu movie update
చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. తెలుగులో  గౌతమీపుత్ర శాతకర్ణి, హిందీలో 'మణికర్ణిక' చిత్రాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన తాజా చిత్రమైన 'హరి హర వీరమల్లు' సినిమా కూడా చారిత్రక నేపథ్యంతో కూడినదే కావడం విశేషం.

'భీమ్లా నాయక్' షూటింగును పూర్తి చేసిన పవన్ కల్యాణ్, మళ్లీ 'వీరమల్లు' షూటింగుకు సిద్ధమవుతున్నాడు. తాజా షెడ్యూల్ కి సంబంధించిన భారీ సెట్స్ రెడీగానే ఉన్నాయి. ఆ తరువాత షెడ్యూల్ కి అవసరమైన లొకేషన్స్ ను ఎంపిక చేసే పనిలో క్రిష్ టీమ్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సువిశాలమైన మైదానాలను క్రిష్ పరిశీలిస్తున్నాడు. మరి అక్కడ ఏవైనా సెట్స్ వేయిస్తాడా? లేదంటే గుర్రాలపై ఛేజింగ్ సీన్స్ ను ఏమైనా ప్లాన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా కనిపించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు..