Police: యువతిపై అత్యాచారయత్నం చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

Soffware engineers rape attempt on woman
  • బాధితురాలు సహా అందరూ ఐటీ ఉద్యోగులే
  • మందుపార్టీలో పాల్గొని వస్తుండగా అత్యాచారయత్నం
  • యువతిని రక్షించిన గస్తీ తిరుగుతున్న పోలీసులు
ఓ యువతిపై ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అత్యాచారయత్నం చేసిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, యువతితో పాటు ముగ్గురు యువకులు ఓ స్టార్ హోటల్ లో పార్టీలో పాల్గొన్నారు. యువతితో సహా యువకులు పీకలదాకా తాగారు. ఆ తర్వాత తెల్లవారుజామున కారులో హోటల్ నుంచి బయల్దేరారు. కారులోనే ఆమె పట్ల యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె కేకలు వేస్తూ... వారిని చెప్పుతో కొడుతూ వచ్చింది. ఆ సమయంలో అక్కడే గస్తీ తిరుగుతున్న పోలీసులు దీన్ని గమనించి కారును ఆపారు. ఆమెతో పాటు అందరూ తాగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై థౌజండ్ లైట్స్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ముగ్గురు యువకులు వేలూరు జిల్లాకు చెందినవారు. దురైపాక్కంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. అన్నాసాలైలోని స్టార్ హోటల్ లో మందుపార్టీలో పాల్గొని వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
Police
Software Employees
Rape Attempt
Chennai

More Telugu News