Geetha Arts: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు గీతా ఆర్ట్స్ రూ.10 లక్షల విరాళం

Geetha Arts donates ten lakhs towards CM Relief Fund
  • చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు
  • నీట మునిగిన తిరుపతి
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • వరద బాధితుల కోసం గీతా ఆర్ట్స్ ఔదార్యం
ఇటీవల వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో నదులు, వాగులు వంకలు పోటెత్తాయి. రోజంతా కురిసిన వర్షానికి తిరుపతి నగరం నీట మునిగింది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిలో జలవిలయం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఉదారంగా స్పందించింది. అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన ఈ సంస్థ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించింది. తిరుపతి వరద సహాయక చర్యల నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నట్టు గీతా ఆర్ట్స్ వర్గాలు పేర్కొన్నాయి.
Geetha Arts
Donation
CM Relief Fund
Floods
Tirupati
Chittoor District
Tollywood
Andhra Pradesh

More Telugu News