'లక్ష్య' రిలీజ్ డేట్ ఖరారు!

24-11-2021 Wed 17:45
  • నాగశౌర్య హీరోగా రూపొందిన 'లక్ష్య'
  • విలువిద్య నేపథ్యంలో సాగే కథ 
  • సిక్స్ ప్యాక్ తో న్యూ లుక్ 
  • డిసెంబర్ 10వ తేదీన రిలీజ్
lakshya release date confirmed
నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి 'లక్ష్య' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా కేతిక శర్మ అలరించనుంది. విలువిద్య నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నాగశౌర్యకి తండ్రి పాత్రలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇటీవల వీళ్ల కాంబినేషన్లో వచ్చిన లిరికల్ సాంగ్ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ తో .. న్యూ లుక్ తో కనిపించనున్నాడు. పోస్టర్స్ నుంచి ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేలా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను వదిలారు.

కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ఇటీవల నాగశౌర్య నుంచి వచ్చిన 'వరుడు కావలెను' ఫలితం ఆయనను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే..