Gautam Gambhir: బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు.. భద్రత పెంపు

Gautam Gambhir Alleges Death Threat From ISIS Kashmir
  • నిన్న రాత్రి 9.32 గంటల సమయంలో ఈమెయిల్
  • చంపేస్తామని హెచ్చరించిన ఐసిస్ కశ్మీర్ ఉగ్రవాద సంస్థ
  • ఈమెయిల్‌పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న రాత్రి 9.32 గంటల సమయంలో ఐసిస్  కశ్మీర్ నుంచి గంభీర్‌కు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు ఢిల్లీ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు.

గంభీర్, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని ఆ ఈమెయిల్‌లో ఉగ్రవాదులు బెదిరించినట్టు చెప్పారు. దీనిపై గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపు ఈ మెయిల్‌పై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Gautam Gambhir
Team India
BJP
ISIS Kashmir

More Telugu News