'ఆచార్య' ఫస్టు సింగిల్ కి 100 మిలియన్ వ్యూస్!

23-11-2021 Tue 17:39
  • కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • త్వరలో వదలనున్న మరో అప్ డేట్
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల  
Acharya movie update
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.

ఆ మధ్య ఈ సినిమా నుంచి 'లాహే లాహే' అనే లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాట, జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. సంగీత సాహిత్యాలు చక్కగా కుదిరిన ఈ పాటకు, అందుకు తగిన కొరియోగ్రఫీ కూడా సెట్ అయింది. ఈ కారణంగానే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది.

ఇలా 'ఆచార్య' ఫస్టు సింగిల్ తోనే ఒక అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. ఇక త్వరలో ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. చరణ్ కి సంబంధించిన అప్ డేట్ రానుందనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.