ED: ఈఎస్ఐ స్కాంలో రూ.144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

ED attach assets in ESI scam
  • తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈఎస్ఐ స్కాం
  • తాజాగా నిందితుల ఆస్తుల అటాచ్
  • మొత్తం 131 ఆస్తుల అటాచ్
  • దేవికారాణికి చెందిన రూ.6.28 కోట్ల నగలు స్వాధీనం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం దర్యాప్తులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. తాజాగా పలువురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం 131 ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల్లో 97 ప్లాట్స్, 18 కమర్షియల్ నిర్మాణాలు, 6 విల్లాలు ఉన్నాయి.

హైదరాబాదు, బెంగళూరు, నోయిడా, చెన్నై నగరాల్లో ఉన్న ఈ ఆస్తులు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరి రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మిలకు చెందినవి. అంతేకాదు, నిందితురాలు దేవికారాణికి చెందిన రూ.6.28 కోట్ల విలువైన నగలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో నగదును ఈడీ స్తంభింపచేసింది. ఈఎస్ఐ లో అక్రమాల వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాం ద్వారా ప్రభుత్వానికి రూ.211 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News