Koratala Siva: రివేంజ్ డ్రామా నేపథ్యంలో కొరటాల మూవీ: ఎన్టీఆర్

Ntr in Koratala movie
  • జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్'
  • ఫిబ్రవరి 4వ తేదీన 'ఆచార్య' రిలీజ్
  • ఆ తరువాత ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్
  • అక్టోబర్లో ప్రశాంత్ నీల్ తో సినిమా
రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుంది? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.

" కొరటాలతో చేయనున్న సినిమా రివేంజ్ డ్రామా .. ఇది ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఆరు .. ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగును పూర్తి చేయాలని అనుకున్నాము. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళుతుంది. ఇది 'కేజీఎఫ్' తరహాలో సాగే భారీ యాక్షన్ సినిమా" అని చెప్పుకొచ్చాడు.
Koratala Siva
Junior NTR
Upcoming Movie

More Telugu News