AP Govt: శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వ తీర్మానం

  • గతేడాది రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు
  • ఆమోదం కోసం కేంద్రం వద్దకు తీర్మానం
  • 22 నెలలుగా ఏ నిర్ణయం చెప్పని కేంద్రం
  • మండలి కొనసాగింపుపై సందిగ్ధత
  • తాజా నిర్ణయంతో మండలి కొనసాగింపు
AP Government takes another key decision

తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది.

మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నేడు సభలో ప్రకటించారు. ఈ మేరకు ఉపసంహరణ తీర్మానం చేశారు. మండలిని యథావిధిగా కొనసాగించాల్సిన అవశ్యకతను వివరించారు. మంత్రి ప్రవేశపెట్టిన మండలి పునరుద్ధరణ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. 

More Telugu News