Priyanka Gandhi: కుమారుడి కంటి చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న ప్రియాంక గాంధీ

Priynaka Gandhi comes to Hyderabad along with his son Raihan
  • నాలుగున్నరేళ్ల క్రితం రైహాన్ కంటికి గాయం
  • క్రికెట్ ఆడతుండగా గాయపడిన వైనం
  • ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఎయిమ్స్ వైద్యులు
  • అప్పట్లో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స
  • మరోసారి చికిత్స కోసం వస్తున్న రైహాన్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాదు వస్తున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాబాదులోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అప్పట్లో హైదరాబాదులో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకువస్తున్నారు. చికిత్స అనంతరం రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు.

ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తిపేరు రైహాన్ రాజీవ్ వాద్రా. రైహాన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Priyanka Gandhi
Hyderabad
Raihan
Eye Treatment

More Telugu News