Amazon: నాసిరకం వస్తువులను విక్రయించడంపై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు

  • నాణ్యతలేని ప్రెజర్ కుక్కర్లను అమ్ముతున్నారన్న సీసీపీఏ
  • ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చర్యలు
  • 13 ఉత్పత్తులపై దృష్టి సారించిన సంస్థ
CCPA Issues Notices To Amazon and Flipkart

నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) నోటీసులను జారీ చేసింది. బీఐఎస్ మార్కుకు లోబడి లేని ప్రెజర్ కుక్కర్ లను అమ్మినందుకు నోటీసులిచ్చింది. పేటీఎం మాల్, స్నాప్ డీల్, షాప్ క్లూస్ తదితర ఈ కామర్స్ సంస్థలకూ నోటీసులు అందాయి. ఈ నెల 18నే నోటీసులిచ్చినట్టు సీసీపీఏ వెల్లడించింది.

నాణ్యత నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చర్యలను తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రెజర్ కుక్కర్లతో పాటు 13 రకాల ఉత్పత్తుల విక్రయాలపై సీసీపీఏ దృష్టి సారించింది. హెల్మెట్ల క్వాలిటీనీ పరిశీలించనుంది.

More Telugu News