ఎయిర్ హోస్టెస్ పాత్రపైనే అనసూయ నమ్మకం!

23-11-2021 Tue 12:27
  • బుల్లితెరపై తగ్గని క్రేజ్ 
  • వెండితెరపై పెరిగిన డిమాండ్ 
  • 'పుష్ప'లో దాక్షాయణి పాత్ర 
  • మరో మూవీలో ఎయిర్ హోస్టెస్ గా అనసూయ
Anasuya movie update
ఒక వైపున బుల్లితెరపై తనకి గల క్రేజ్ ను కాపాడుకుంటూనే, వెండితెరపై తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి అనసూయ ప్రయత్నిస్తోంది. ఇటీవల వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉంది. 'పుష్ప' సినిమాలో ఆమె 'దాక్షాయణి' అనే పాత్రలో కనిపించనుంది. మాస్ లుక్ తో కూడిన ఈ పాత్ర ఆమెకి మంచి పేరు తీసుకురావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

అయితే మరో సినిమా కోసం తాను చేస్తున్న ఎయిర్ హోస్టెస్ పాత్ర కూడా తనకి మరింత పేరు తీసుకొస్తుందని అనసూయ చెబుతోంది. 'పేపర్ బోయ్' సినిమా దర్శకుడు జయశంకర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా నటిస్తోంది. కథలో ఆమె పాత్ర చాలా కీలకం.  

'క్షణం' ..  రంగస్థలం'  సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా తనకి మంచి పేరు తీసుకువస్తుందని ఆమె చెబుతోంది. తన కెరియర్ లోనే బెస్ట్ రోల్ గా నిలుస్తుందని అంటోంది. 'దాక్షాయణి' పాత్రకి మించి ఈ పాత్ర ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో కలగడం ఖాయంగానే కనిపిస్తోంది. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.