'అద్భుతం' సినిమాపై మెగాస్టార్ ట్వీట్!

23-11-2021 Tue 11:45
  • తేజ సజ్జ నుంచి వచ్చిన 'అద్భుతం'
  • కథానాయికగా శివాని రాజశేఖర్ 
  • సినిమా చూసి అభినందించిన మెగాస్టార్ 
  • ధన్యవాదాలు తెలిపిన తేజ సజ్జ
Adbhutham Movie Update
తేజ సజ్జా - శివాని రాజశేఖర్ జంటగా రూపొందిన 'అద్భుతం' సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విభిన్నమైన కథాకథనాలతో వచ్చిన ఈ సినిమా, యూత్ కి బాగానే కనెక్ట్ అయింది. అయితే ఈ లైన్ .. ఈ స్క్రీన్ ప్లే సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు కూడా.

ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందంటూ నిన్న ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఇక ఈ సినిమాను గురించి చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. "నిన్న రాత్రే హాట్ స్టార్ లో 'అద్భుతం' సినిమాను చూశాను. ఇది ఒక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా.

తేజ సజ్జ .. శివాని ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. వారి నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమా టీమ్ లోని అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది" అని రాసుకొచ్చారు. ఇంతటి ప్రోత్సాహకరమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తేజ సజ్జ స్పందించాడు. ఆయన పట్ల తనకి గల ప్రేమాభిమానాలను వ్యక్తం చేశాడు.