AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల కుదింపు.. నేటితో ఆఖరు!

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు
  • నేడు మరో 11 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • మండలిలోనూ ఆమోదముద్ర పడితే నేటితో సమావేశాలకు ఆఖరు
  • లేదంటే రేపు కూడా కొనసాగించే అవకాశం
AP Assembly session ends today

ఆంధ్రప్రదేశ్‌లో వరదల ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడింది. వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు వీటిని నేడు, లేదంటే రేపటితో ముగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశాల్లో మొత్తం 23 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం సోమవారం 12 బిల్లులను ప్రవేశపెట్టింది. నేడు వీటిని ఆమోదించడంతోపాటు మిగిలిన 11 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అనంతరం వీటిని ఆమోదించి శాసనమండలి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. అక్కడ కూడా వీటికి ఆమోద ముద్ర పడితే కనుక నేటితోనే అసెంబ్లీ సమావేశాలను ముగిస్తారు. అలా కాకుండా బిల్లుల ఆమోదంలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే మాత్రం మరో రోజు అంటే రేపు కూడా కొనసాగించే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో 5 రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News