ఆర్టీసీ బస్సు స్పెషల్ ఏమిటో తెలుసా? అనే మీమ్ ను షేర్ చేసిన సజ్జనార్

22-11-2021 Mon 11:30
  • ఇటీవల రాపిడో సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జనార్
  • సజ్జనార్ దెబ్బకు యాడ్ లో మార్పులు చేసిన రాపిడో
  • తాజాగా వైరల్ అవుతున్న ఓ మీమ్ ను షేర్ చేసిన సజ్జనార్
Sajjanar shares a meme in Twitter
ఆర్టీసీని తక్కువ చేస్తూ రాపిడో సంస్థ చేసిన యాడ్ పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాపిడో సంస్థతో పాటు ఆ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని... డబ్బు కోసం ప్రభుత్వ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో రాపిడో సంస్థ దిగొచ్చింది. తన యాడ్ లో మార్పులు చేసింది.

మరోవైపు ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఓ మీమ్ ను సజ్జనార్ షేర్ చేశారు. ఆర్టీసీ బస్సు స్పెషల్ ఏంటో తెలుసా? అంటూ ఉన్న మీమ్ ను పంచుకున్నారు. 'రఘువరన్ బీటెక్' సినిమాలో నిరుద్యోగం గురించి ధనుష్ గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగును ఈ మీమ్ పోలి ఉండటం ఆసక్తికరంగా ఉంది.