Shannon Tubb: ఆసీస్ మాజీ సారథి టిమ్ పైన్ బావ కూడా ఘనుడే... అదే మహిళతో అసభ్య చాటింగ్!

Tim Paine brother in law Shannon Tubb lost his coaching position after allegedely sexting to same woman
  • ఇటీవల ఆసీస్ కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా
  • ఓ మహిళతో అసభ్య చాటింగ్
  • అదే మహిళకు షానన్ టబ్ అశ్లీల సందేశాలు
  • టిమ్ పైన్ సోదరిని పెళ్లాడిన షానన్ టబ్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో పనిచేస్తున్న ఓ జూనియర్ ఉద్యోగినితో అసభ్య చాటింగ్ చేసిన కారణంగా టిమ్ పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తెలిసిందే. తాజాగా అంతకంటే సంచలనాత్మక విషయం వెల్లడైంది. టిమ్ పైన్ బావ షానన్ టబ్ కూడా అదే మహిళతో అసభ్య చాటింగ్ చేసినట్టు తెలిసింది. షానన్ టబ్ గతంలో టాస్మేనియా రాష్ట్ర జట్టుకు ఆడాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక టాస్మేనియాలోని ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ కాలేజి కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. టిమ్ పైన్ సోదరినే షానన్ టబ్ పెళ్లి చేసుకున్నాడు.

బావబావమరుదులు ఇద్దరూ ఒకే మహిళతో ఫోన్ ద్వారా అసభ్య సంభాషణ సాగించారన్న విషయం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలను కుదిపిస్తోంది. టబ్ పై ఆరోపణలు రావడంతో అతడి కోచింగ్ పదవి ఊడింది. టబ్ పై 2018లోనే ఆరోపణలు రాగా, టాస్మేనియా క్రికెట్ బోర్డు అప్పట్లోనే విచారణ షురూ చేసింది. మరోసారి ఆ అంశం తెరపైకి రావడం, టిమ్ పైన్ రాజీనామా చేయడం వంటి అంశాల నేపథ్యంలో టాస్మేనియా క్రికెట్ నుంచి టబ్ కు ఉద్వాసన పలికింది.

  • Loading...

More Telugu News